Sunday, August 4, 2013

హలో !

హలో   !

ముందుగా  నా గురించి :


అది 1985వ సంవత్సరం. మా అమ్మా, నాన్నలకు చివరి  కొడూకుగా జన్మించా. పుట్టగానే కళ్ళు తెరవలేదని నర్స్ పిర్ర మీద ఒక్కటేసింది. నాకు బాగా నొప్పొచ్చి 'అమ్మా' అని ఏడిచా.   చాలా మంది నేను పుట్టగానే నాజాతకం చూసి వారసుడు, వంశోర్ధారకుడు, అదృష్టవంతుడు. ఒక్కమగాడు, బాలకృష్ణ, పెర ట్లో మొక్క అని అన్నారట !
             ఆ రోజు నాకు బారసాల. నాకు పేరేంపెడతారబ్బా అని నేను మా అమ్మ ఒళ్ళో పడుకుని నోట్లోవేసుకుని అందరివంకా చూస్తున్నా. ఇంతలో పంతులుగారు ఏవండి  శర్మ గారు అబ్బాయి పేరేమనుకుంటున్నారు ? అన్నారు. మా నాన్న 'కిష్టయ్య ' అన్నారు .కిష్టయ్య  బానే ఉంది ఈ పేరనుకునేలోపు మా అమ్మ అదేంటండి ఒట్టి కిష్టయ్య అని మా నాన్న గారి పేరు  బావుంటుంది అని 'రామ కృష్ణ ' అని మార్చింది మా నాన్న గారి ఓకే సూపర్ అన్నారు ఇంతలో పంతులుగారు శర్మ గారి పిల్లాడు శర్మ కాకపోతే ఎలా అని అది కూడా కలిపారు ఇంకేముంది మనపేరు రామకృష్ణ శర్మ ఇపాయింది . 

మా ఇంటిలో అందరు కిష్టయ అని ముద్దు గా పిలిస్తారు , మా నాన్న గారు మాత్రం నాన్నగారు అని , అక్క కన్నా అని పిలిచేది ,  పేరులో ఏం వుంది అనుకోకండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి మా ఫ్యామిలి లో ప్రతి ఇంటిలో ఒక కృష్ణ వుంటాడు . 

మా ఇంటిలో కృష్ణ లు : పెద్ద నుండి చిన్న కి 

1, వెంకట కృష్ణ శాస్త్రి ( పెద్ద  పెద్దనాన్న కొడుకు )
2, కృష్ణ శర్మ ( పెద్దనాన్న కొడుకు )
3, రామకృష్ణ శర్మ ( నేను )
4, కృష్ణ మూర్తి ( బాబాయ్ హింసెల్ఫ్ )
5, శ్రీ కృష్ణ ( పెద్ద అత్త   కొడుకు )
6, మురళి కృష్ణ ( రెండోఅత్త  కొడుకు )
7, శివ కృష్ణ ( బుల్లి అత్త  కొడుకు ) 

టోటల్ ఫామిలికి ఒక అలోవాటు మా కృష్ణ అందరిని కిష్టయ అని పిలుస్తారు  ! నాకు చాల కాలం అర్ధం కానీ విషయం ఏంటి అంటే అందరు కృష్ణలు ఒక దగర వున్నా ఎవరు కిష్టయ అని పిలిచినినా ఎవరిని పిలిస్తే వాళ్ళు మాత్రమే పలికేవారు  ! మా నాన్న నన్ను మా బాబాయ్ ని కూడా కిష్టయ అని పిలుస్తాడు బట్ మేం ఇద్దరం కలసి ఒకసారి పలకం నాన్న ఎవరిని పిలుస్తాడో తెలిసిపోతుంది . మా అక్క నన్ను తన కూతురు అంటే నా మీకో ( మేన కోడలు ) ఇద్దరినీ కన్నా అని పిలుస్తుంది  బట్ మేం ఇద్దరం కలసి ఒకసారి పలకం అక్క ఎవరిని పిలుస్తాడో తెలిసిపోతుంది . 
సమె నీన్ ఏడుగురు కృష్ణలు ఒకే దగర వున్నా  ఎవరు కిష్టయ అని పిలిచినినా ఎవరిని పిలిస్తే వాళ్ళు మాత్రమే పలికేవారు  !  నిజం నమ్మాలి మరి ట్రూ స్టొరీ . 

నన్ను , చిన్నపుడు స్కూల్ లో కిష్టయ అని , ఆరో తరగతి నుండి ఇంటర్ వరకు శర్మ అని కాలేజీ లో శర్మ , కృష్ణ , రామ కృష్ణ అని , హైదరాబాద్ మై ఫస్ట్ జాబు ఆఫీసు లో శర్మ అని , చెన్నై ఫస్ట్  జాబు ఆఫీసు లో చావాలి అని (  చావాలి ఇంటి పేరు , య మీ ఆలోచన కరెక్ట్ ఆ సంగీత  విద్వాంసుడు  చావాలి . కృష్ణ మూర్తి గారు మా చిన్న తత్తయ్య )  ఇక ప్రస్తుతం పీపుల్ కాల్ మీ రామ్ .

ఈ సోది అంతా మాకెందుకు బ్లాగేది బ్లాగిత చదువుతాం అనుకున్నార సరే సరే , అసలు చాల రోజుల తరువాత బ్లాగడం మళ్ళా  ఎందుకు అంటే నా చిన్న నాటి అందమైన జ్ఞాపకాలు ఎక్కడ మీతో పంచుకోలేనోమో అని బయం . అందుకే మళ్ళి బ్లాగడం .

నా బ్లాగు అప్డేట్ చేసే వరకు ! నా కధలు షేర్ చేసుకొనే మీకు.  

మీ 
కిష్టయ్య .