Saturday, January 21, 2017

కిష్టయ్య అలగడం


నేను మా ఇంటిలో చిన్న పిల్లాడిని కావడం తో అందరికి నేనంటే బాగా ముద్దు . నాకు ఇద్దరు అన్నలు ఒక ఆక్క , ఇంతకీ నా పేరు మీకు తెలెయదు కదా , నా పేరు  " రామకృష్ణ శర్మ " నన్ను ఇంటిలో అందరు ముద్దు గా కిష్టయ్య అని పిలుస్తారు నా మెమొరి ఎక్కువ అని నాకు నమ్మకం అందుకే నా ౩ ఏళ్ళ నుండి జరిగినవి అన్ని నాకు బాగా గుర్తు .

కిష్టయ్య అలగడం : 

                  నాకు తెలిసి నాకు గుర్తువుంది నీను అలగడం అదే మొదటిసారి , ఆ రోజులలో ఫోన్లు లేవు , నాన్నగారు మార్కెట్లోకి వెళుతూ వెళుతూ నన్ను అడగరు నీకు ఏం కావాలి నాన్నగారు అని ( అంటే ఇంటిలో అందరు కిష్టయ్య అని పిలిచినా మా నాన్నగారు మాత్రం నన్ను నాన్నగారు అని పిలిచే వారు ) నేను చాలా తెలివిగా ఏదో వొకటి తెచ్చుకోండి అన్నాను అంటే మా నాన్నగారు ఆ విషయాన్నీ అందరితో చేపడం నవ్వడం , పక్క ఇంటిలో వాళ్ళకి మా ఇంటిలో అందరికి చెప్పడం నవ్వడం నాకేమో ఏడుపొచ్చింది ఎందుకు నవ్వుతునారు నానా అని అడగను మల్లి  నవ్వారు ఇంకా నేను ఏడుస్తూ ఆక్క దగ్గరకి వెళ్ళను ! ఆక్క నన్ను వురుకోపెట్టింది నానగారు మార్కెట్ కి వెళ్ళరు , నేను నాన్నగారు వచ్చే వరకు వెయిట్ చేస్తూ గడిపాను , కానీ నాన్నగారు వచ్చేసరికి నీను పడుకున్నట్లు నటించాను కాని మా నాన్నగారు మాత్రం నేను పడుకోలేదని పోల్చేసారు ఇంకా నాన్నగారు నాటకం మొదలు పెట్టారు.

నాన్న గారు : నేను కిష్టయ్య కోసం జిలేబి తెచ్చాను అయ్యో ! వాడు పడుకున్నాడ మరి ఎలా బాలా ( మా అమ్మ బాల త్రిపుర సుందరి నాన్నగారు మాత్రం బాల అని పిలుస్తారు ) ఏం నువ్వు తిను .
అమ్మ : మీరు నా కోసం తెచ్చార ఏంటి మీరే తినండి .
నాన్న గారు : సరే శీను , పాపాయ్ రండి మనం తిందాం ( శీను అంటే మా పెద్ద అన్నయ్య , పాపాయ్ అంటే మా ఆక్క )
ఇంకా డ్రామా మొదలు జిలేబి బాగుంది బాగుంది అని నాకు నోర్రు ఉర్రి నిద్ర లేచినట్లు నటించి జిలేబి ఏది అని అడిగాను , ఐపాయింది మల్లి అందరు నవులూ మొదలు . నాకు కోపం వచ్చి అందరు యెంత బతిమాలిన యీమి తినకుండా పడుకున్నాను దానికి ప్రతిఫలం ఆర్దరాత్రి మల్లి ఆకలి ఆపుడు లేచి అక్కని అడిగితె ఆక్క ఎవరిని నిద్రలేపకుండా నన్ను వంటగదిలోకి తీసుకుని వెళ్లి బంగాలదుంపల కుర పెరుగు అన్నం పెటింది .

అది మన అలక స్టొరీ . ఈ స్టొరీ నచ్చితే నాకు రిప్లై పెటండి ప్లీజ్

నా కధలు షేర్ చేసుకునే మీకు
కిష్టయ్య  

No comments:

Post a Comment