Sunday, January 29, 2017

రాజుగారు ఏడుగురు కొడుకుల కధ, కధ కు మా రియాక్షన్ విత్ నాన్న ( శర్మ తాతయ్య తో ! ).....


ఈ కద వినని వాళ్ళు ఉంటారా ?
నాకు తెలిసి పరంపర్యం గా . మా తాతలు వాళ్ళకి వాళ్ళ తాతలు లేదా బామ్మలు చెప్పే కధ " రాజుగారు ఏడుగురు కొడుకుల కధ, "
ఐతే ఈ కధ మానాన్న నాకు ఆయన మనవళ్ళకి &  మానవరాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ రాయడమే నా  ఉదేశ్యం .

  ఒక రాజు > ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ! , వాళ్ళు ఏడుగురు వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు !..  అందిలో ఒక చెప ఎండలేదు !..  రాజుగారి కొడుకు ఇలా అడిగాడు !చేప చేప ఎందులుఎండలేదు .. దానికి చేప ! ఇలా చెప్పింది ..  గడ్డి మోపు అడ్డం వచ్చింది.  ..
గడ్డి మోప గడ్డి మోప ఎందుకె అడ్డం వచ్చావ్ ? ఆవు నన్ను తినలేదు !
ఆవు ఆవు ఎందుకు తినలేదు ? గొల్లవాడు నాన్న వదలడానికి రాలేదు.
గొల్ల పిల్లోడా ఎందుకు రాలేదు ? అమ్మ అన్నం పట్టలేదు ..
అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు ? నాబిడ్డ ఏడుస్తునాడు అందుకు పెట్టలేదు.
చిన్న పాపా చిన్ని పప్పా ఎందుకు ఈడుస్తునవ్ ? . నాకు చీమ కుట్టింది ...
చీమ చీమ ఎందుకు కుట్టావ్ ? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా కుట్రనా ... అని కదా వినేవాళ్ళని కుట్టిందంట .........

ఇపుడు మా రియాక్షన్స్ & క్యూస్షన్స్ !
కిష్టయ్య ( నేను  ):

అనగా అనగా  ఒక రాజు > ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ! ,
నేన్ను : వాళ్ళ పేర్లు ఏంటి నాన్న?
పండుగాడు : ఏడుగురే !..

వాళ్ళు ఏడుగురు వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చారు !..
నేను : చేపలు పెద్దవా చిన్నవా ?
పండుగాడు : చేపలా యాక్ !..
శ్రావణి : వాళ్ళు వేటకి వెళ్తే చేపలా తెచ్చేది .. ఏ  జింకో .. కుందేలూ తేవాలిగాని.

అందిలో ఒక చెప ఎండలేదు !.
ఎండ లేదేమో ! ఐనా ఎందుకు ఎండబెట్టాలి ?.

రాజుగారి కొడుకు ఇలా అడిగాడు !చేప చేప ఎందులుఎండలేదు .. ?
నేను, శ్రావణి, పండుగాడు: చేప మాట్లాడిందా ? !....

దానికి చేప ఇలా చెప్పింది ..  గడ్డి మోపు అడ్డం వచ్చింది.  ..
నాన్న రాజు కొడుకు అక్కడే ఎందుకు ఎండబెట్టాడు ? ( నాన్న ఆన్సర్ : వాడికి బుద్ధి లేక  )
శ్రావణి : చేపలు తెచ్చినప్పుడే చనిపోయాయి కదా తాతయ్య ? మళ్ళా ఎండలో ఎందుకు !

గడ్డి మోప గడ్డి మోప ఎందుకె అడ్డం వచ్చావ్ ? ఆవు నన్ను తినలేదు !  ఆవు ఆవు ఎందుకు తినలేదు ? గొల్లవాడు నాన్న వదలడానికి రాలేదు.  గొల్ల పిల్లోడా ఎందుకు రాలేదు ? అమ్మ అన్నం పట్టలేదు ..
అమ్మ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు ? నాబిడ్డ ఏడుస్తునాడు అందుకు పెట్టలేదు.

పండు గాడు : వాళ్ళ అమ్మకి 2 పాపలా తాతయ్య  ?

చిన్న పాపా చిన్ని పప్పా ఎందుకు ఈడుస్తునవ్ ? . నాకు చీమ కుట్టింది .. చీమ చీమ ఎందుకు కుట్టావ్ ? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా కుట్రనా ... అని కదా వినేవాళ్ళని కుట్టిందంట .........


           ఈ కదా విన్నపుడు ఆల్మోస్ట మా వయసు నాలుగు లేక ఐదు సంవత్సరాలు .. మాకే ఇన్ని ప్రెశ్నలు వస్తే చెప్పే వాళ్ళకి ఎన్ని రావాలి అని మా నాన్నని ఒకసారి అడిగా ఈ కదా అంతరార్థం ఏమిటి అని . ..


ఇంకా మరికొన్ని ప్రెశ్నలు & అంతరార్థం ఏమిటా అనేది రాజుగారు ఏడుగురు కొడుకుల కధ పార్ట్ 2 లో చెప్తా
అప్పటి వరకు ..నా కధలు షేర్ చేసుకునే మీకు ......
మీ
కిష్టయ్య ...













1 comment:

  1. https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com
    https://www.telugunetflix.com

    ReplyDelete