ఈపాటికే మీకు అర్ధం ఇయే వుంటుంది ఈరోజు బ్లాగు మా పాల సూరిబాబు గురించి . మేము మురళి మోహన్ నగర్ లో ఇంటికి వచ్చినప్పటినుండి మాకు పాలు పోసేది సూరిబాబు అండ్ ఫ్యామిలీ . మొదట వాళ నాన్న పోసేవాడు , తరువాత సూరిబాబు వాళ్ళ చిన్న అన్నయ . అతని పేరు ఆచుతరావు . ఆచుతరావు కు చదువుకోవాలని ఆస కానీ తనకి ఆ ఆలోచన వచ్చే సరికే తనకి వయసు ఇపాయింది అని రోజు బాదపడుతూ ఉండేవాడు ఒక రోజు సాయంత్రం వచ్చి మాస్టారు నాకు చదువు చెపుతార అని మా అన్నాయని అడిగాడు , పాపం వాడు చదువుకుంటాను అని అన్నడు కాబట్టి అన్నయ ఓకే అని అన్నాడు , వాడికి 5 గురు టీచర్స్ , పెద్ద అన్నయ , చిన్న అన్నయ , ఆక్క , నేను మా నాన్న ,
పాపం రోజు అన్ని ఇళ్ళకి పలు పోసి చివరకి మా ఇంటిదగర గడపలో కుర్చుని చదువు నేర్చుకునేవాడు ఒక రెండు నెలలు గడిచేసరికి వాడికి కొంచం కొంచం గా బస్ మీద పేరు పేపర్లో హెడ్ లైన్స్ కొచం కూడా పలుక్కుని చదివే స్తాయికి వచ్చాడు .
పాపం వాడు చదువు నేర్చుకోవడం మా అందరికి చాల అనందం గా వుండేది , అదే సమయం లో వల తమ్ముడు సూరిబాబు పాలుపోయడానికి రావడం మొదలు పెట్టిన రోజులుఅవి ఇంకేముంది వాళ్ళ అన్నయ చదువు చట్టుబందలింది , తరువాత తరువాత సూరిబాబు కుడా చదువు కుంటాను అని అడిగాడు మేము ఎవరం కూడా రేస్పోన్స్ ఇవ్వలేదు ఎందుకంటె మాకు సూరిబాబు మీద చిన్న కోపం వాళ్ళ అన్నయ చదువు పోయేలా చేసాడని ఒకరోజు పాపం నిజం చెప్పేసాడు తనకి బుస్మెడ పేరు చదవడం కూడా రాదు అని తను పెళ్లి చేసుకునే అమ్మాయి టెంతు క్లాస్సు చదువుకుంది అని తనకి కూడా చదువుకోవాలని వుంది అని . ఎట్టకేలకి మావాళ్ళని వోపించాడు సూరిబాబు .
మరునాటి నుండి క్లాస్సులు ప్రారంబం , పాపం వాడికి వచ్చేవి కాదు వాడికి లెక్కలు చేపేవాళ్ళం , తెలుగు రాయడం నేర్పేవాళ్ళం ఐనా సూరిబాబుకి చదువు అంటే ఇష్టం పెరిగింది మొదట్లో వారానికి రెండుసార్లు వచేవాడు తెరువాత రోజురావడం వరండాలో కుర్చుని చదవడం మొత్తానికి ఒక నాలుగు నెలలు గడిచేసరికి పేపర్లో మెల్లగా పదాలు చదవడం వచ్చింది ,
ఆ టైం లో మా చిన్న అన్నయ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు , సాయంత్రం సూరిబాబు ఏమండీ మూర్తి మీకు అంత చదువు ఎలా వచిందండి నాకీ ఏటి రకున్తన్దీ అని అడిగాడు , దానికి మా అన్నయ బదులుగా చాడువురవాలంటే ఏది కనపడితే అది చదవాలి రాయటం అలవాటుచేసుకోవాలి నువ్వు కూడా అలచేయ్యు అని సలహా ఇచ్చాడు పాపం ఒక వరం తరువాత ఒకరోజు సాయంత్రం అమాయకం గా మూర్తి గారు నేను ఇది రాసాను చుడండి అని ఒక కాయితం ఇచ్చాడు ,
ఇంకా ఇంటిలో అందరు నవ్వులు మొదలైంది ఏంటి మూర్తి నవుతునావ్ అని అని అడిగాడు సూరిబాబు , ఇంతకీ సూరిబాబు రాసి తెసుకుని వచ్చింది స్వాతి పుస్తకం లో సుక సంసారం ! అదండీ మా సూరిబాబు చదువు కధ
నా కధలు షేర్ చేసుకునే మీకు ......
మీ
కిష్టయ్య
No comments:
Post a Comment